భారతదేశం, ఏప్రిల్ 16 -- స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కొంతకాలంగా బాగా సన్నబడుతున్నారు. బరువు తగ్గిపోతున్నారు. తాజాగా ఆయన దిగిన ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మునుపు కంటే ఆయన చాలా సన్నగా కనిపిస్తున్నారు. దీంతో ఏమైందంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రకరకాల రూమర్లు వస్తున్నాయి.

ఓ హోటల్ సిబ్బందితో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ ఫొటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సడెన్‍గా ఎన్టీఆర్ అంత సన్నగా ఎలా అయ్యారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బరువు తగ్గేందుకు ఒజెంపిక్‍ అనే ఇంజెక్షన్లను ఎన్టీఆర్ తీసుకుంటున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఎన్టీఆర్ కొత్త లైఫ్‍స్టైల్ ఫాలో అవుతూ బరువు తగ్గుతున్నారని, ఒజెంపిక్ వాడడం లేదని విశ్వసనీయ వర్గాల నుంచి హెచ్‍టీకి సమాచారం తెలిసింది. ఎన్టీఆర్ చాలా ఆరోగ్యకరంగా ...