భారతదేశం, మార్చి 17 -- ఐపీఎల్ 18వ​ సీజన్​కి ముందు క్రేజీ ఆఫర్​ని ప్రకటించింది రిలయన్స్​ జియో. ఈ ప్రత్యేక ఆఫర్​లో భాగంగా జియో కస్టమర్లు.. టీవీ/ ఫోన్​లో 90 రోజుల ఉచిత జియో హాట్​స్టార్, క్రికెట్ మ్యాచ్​ల 4కే స్ట్రీమింగ్, జియో ఫైబర్ / ఎయిర్​ఫైబర్​కు 50 రోజుల ఉచిత కనెక్షన్​ని పొందవచ్చు.

జియో సిమ్ కార్డు పాత, కొత్త కస్టమర్లకు ఈ కొత్త ఎక్స్​క్లూజివ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని టెలికాం దిగ్గజం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్​తో రీఛార్జ్ చేసుకుంటే చాలు ఈ క్రేజీ బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ నేపథ్యంలో జియో లేటెస్ట్​ ఆఫర్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మార్చ్​ 22న కోల్​కతా నైట్​రైడర్స్​ వర్సెస్​ రాయల్​ ఛాలెంజర్స బెంగళూరు మ్యాచ్​తో ఐపీఎల్​ 18 సీజన్​ ప్రారంభంకానుంది. ఇండియాలో ఐపీఎల్​కి ఉన్న క్రేజ్​ గురించి ...