భారతదేశం, సెప్టెంబర్ 30 -- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- జేఈఈ మెయిన్స్​ 2026కు హాజరు కావాలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకునే ముందు అప్లికేషన్ లేదా అడ్మిషన్ ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అభ్యర్థులు తమ ముఖ్యమైన డాక్యుమెంట్లను సరిచూసుకుని, అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

జేఈఈ మెయిన్స్​ 2026 పరీక్ష రెండు సెషన్లలో (జనవరి 2026, ఏప్రిల్ 2026) జరగనుంది.

మొదటి సెషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం అక్టోబర్ 2025లో అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో అందుబాటులో ఉంటుంది.

ఎన్టీఏ సలహా ప్రకారం.. విద్యార్థులు ఈ కింది డాక్యుమెంట్లు ఖచ్చితంగా, అప్డేటెడ్​గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి:

ఆధార్ కార్డు: మీ పేరు, పుట్టిన తేదీ (10వ తరగతి సర్టిఫికె...