భారతదేశం, ఏప్రిల్ 12 -- జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్​ 2025 సెషన్ 2కు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. విద్యార్థులు jeemain.nta.nic.in లో ఆన్సర్​ కీని చెక్​ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్ 2 ఆన్సర్ కీ డౌన్​లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జేఈఈ మెయిన్స్​ ఆన్సర్ కీతో పాటు ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రికార్డు చేసిన సమాధానాలను కూడా అధికారిక వెబ్సైట్​లో చూడవచ్చు. అభ్యంతరాలు చెప్పాలనుకునే అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. ఏప్రిల్ 13 రాత్రి 11:50 గంటల వరకు ఈ విండో యాక్టివ్​గా ఉంటుంది.

జేఈఈ మెయిన్ 2025 రెండో సెషన్ ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరిగింది. కాగా పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్షకు సం...