Hyderabad, మార్చి 18 -- Janhvi Kapoor Boyfriend: జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్ తెలుసు కదా. అతని పేరు శిఖర్ పహారియా. ఇప్పుడతడు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాడు. తన కులం గురించి ప్రస్తావిస్తూ దళితుడిని అంటూ ఓ వ్యక్తి ప్రస్తావించడంపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ కాలంలో అంటరానిది ఏదైనా ఉందంటే అది నీ ఆలోచన మాత్రమే అంటూ అతడు కామెంట్ చేయడం గమనార్హం.

గతేడాది దీపావళికి శిఖర్, జాన్వీ తమ పెంపుడు కుక్కలతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో శిఖర్ పోస్ట్ చేశాడు. ఇటీవల ఓ వ్యక్తి ఆ పోస్ట్ కింద "నువ్వు దళితుడివి కదా (Lekin tu toh Dalit hai)" అని కామెంట్ చేశాడు. దానికి శిఖర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ కామెంట్‌ను పోస్ట్ చేస్తూ, "2025లో కూడా నీలాంటి చిన్న, వెనుకబడిన ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉండటం నిజంగా సిగ్గుచేటు" అని రాశాడు.

ఇండియా బలం దాని ...