భారతదేశం, ఫిబ్రవరి 24 -- Jagityala Crime: జగిత్యాలలోని పోచమ్మవాడలో దారుణం జరిగింది. ఆస్తి తగదాలతో అన్నపై ఇద్దరు చెల్లెళ్ల దాడి‌ చేశారు. తీవ్ర గాయాలతో అన్న జంగిలి శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

జగిత్యాలకు చెందిన జంగిలి బసవయ్య కు ఇద్దరు కుమారులు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. అందరికీ వివాహాలు అయి ఎవరికి వారు ఉంటున్నారు. బసవయ్య పెద్ద కూతురు భారతపు వరలక్ష్మి భర్త చనిపోయినప్పటి నుండి గత 22 సంవత్సరాలుగా తల్లి ఇంటి వద్దే ఉంటుంది. చిన్నబిడ్డ వడ్నాల శారద భర్తను వదిలేసి తల్లిగారి ఇంటి సమీపంలో కిరాయికి ఉంటుంది.

వరలక్ష్మి శారద ఇద్దరు కలిసి ఇంటిని ఆనుకుని ఉన్న 100 గజాల భూమిని తమకు రాసి ఇవ్వాలని తండ్రి బసవయ్యతో సోదరుడు శ్రీనివాస్ తో తరచు గొడవ పడేవారు. పది సంవత్సరాల క్రితం బసవయ్య వంద గజాల భూమిని కొడుకు శ్రీనివాస్ కు రాసిస్తానని అనడంతో...