భారతదేశం, మార్చి 10 -- కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూటే సపరేట్ అన్నట్టు ఉంటుంది. చాలాసార్లు సెన్సేషనల్ కామెంట్లు, డిఫరెంట్ కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మరోసారి విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు జగ్గారెడ్డి. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. అది కూడా నటుడిగా. సాధారణంగా సినిమాల్లో పాపులర్ అయ్యాక కొందరు యాక్టర్లు సినిమాల్లో అడుగుపెడతారు. జగ్గారెడ్డి మాత్రం దశాబ్దాల రాజకీయ జీవితం తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా రివీల్ అయింది.

ఈ చిత్రం 'జగ్గారెడ్డి' టైటిల్‍తోనే రానుంది. లవ్ ఆఫ్ వార్ అనే ట్యాగ్‍లైన్ ఉంది. ఓ యువ జంట ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. వారిని సంరక్షించే నాయకుడిగా జగ్గారెడ్డి నటించనున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చాయి. ఇంటెన్స్ లుక్‍లో జగ్గారెడ్డి ...