భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి గడువు సెప్టెంబర్ 15 తర్వాత పొడిగించే ప్రసక్తే లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. "ఐటీఆర్‌ ఫైలింగ్​కి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025గానే ఉంది," అని తెలిపింది.

గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారనేది ఫేక్​ న్యూస్​ అని క్లారిఫై చేస్తూ, ఆదాయపు పన్ను శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

"వాస్తవానికి జులై 31, 2025న ముగియాల్సిన ఐటీఆర్​ ఫైలింగ్​ గడువును సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. ఇప్పుడు దీనిని సెప్టెంబర్ 30 వరకు పొడిగించారని తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి," అని ఐటీ శాఖ పేర్కొంది.

సమయానికి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం అధికారిక 'ఇన్​కమ్​ ట్యాక్స్​ ఇండియా' ఖాతాను మాత్రమే నమ్మాలని ...