భారతదేశం, సెప్టెంబర్ 15 -- అసెస్‌మెంట్ ఇయర్ 2025-26కి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి నేడు (సెప్టెంబర్ 15) చివరి రోజు. గడువు దాటితే జరిమానా తప్పదని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది.

ఇప్పటికే ఆరు కోట్ల మందికి పైగా పన్ను రిటర్న్స్ దాఖలు చేయగా, చివరి నిమిషంలో దాఖలు చేసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. "ఇప్పటివరకు 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు కావడానికి సహకరించిన పన్ను చెల్లింపుదారులు. పన్ను నిపుణులకు ధన్యవాదాలు." అని ఆదాయపు పన్ను శాఖ తమ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.

వాస్తవానికి ఈ గడువు జులై 31తో ముగియాల్సి ఉంది. అయితే, ఐటీఆర్‌ ఫారమ్‌లలో "నిర్మాణ- కంటెంట్ సవరణల" కారణంగా ఆరు వారాలు పొడిగించారు. ఈసారి మాత్రం గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి త...