భారతదేశం, మార్చి 23 -- పాఠశాల విద్యార్థుల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం 'యువిక'పై కీలక అప్డేట్​. ఇస్రో యువిక 2025 రిజిస్ట్రేషన్ విండో మార్చ్​ 23తో ముగియనుంది. విద్యార్థులు/ తల్లిదండ్రులు ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం అధికారిక వెబ్సైట్​ (jigyasa.iirs.gov.in.) లోదరఖాస్తు చేసుకోవచ్చు.

యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ "యువ విజ్ఞాని కార్యక్రం" లేదా యువిక అనేది యువ విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్రం, అంతరిక్ష యాప్స్​పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి ఇస్రో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం.

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) ఆధారిత రీసెర్చ్/కెరీర్​లో మరింత మంది విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ ప్రోగ్రామ్ దోహదపడుతుంది.

భారతదేశంలో 2025 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థ...