భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఇస్రోలోని ప్రముఖ కేంద్రమైన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్​ఎస్​సీ) సైంటిస్ట్/ఇంజనీర్-ఎస్​సీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాల్లో భాగం అవ్వాలనుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్-గ్రాడ్యుయేట్లకు ఇది ఒక అద్భుత అవకాశం. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అర్హతలను సరిచూసుకొని వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 22, 2025 (ఉదయం 10 గంటల నుంచి)

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 6, 2025 (సాయంత్రం 5 గంటల వరకు)

అర్హత కటాఫ్ తేదీ: అక్టోబర్ 6, 2025

దరఖాస్తులను కేవలం అధికారిక వెబ్‌సైట్ vssc.gov.in ద్వారా మాత్రమే సమర్పించాలి.

ఇస్రో వీఎస్​ఎస్​సీ రిక్రూట్​మెంట్​ 2025లో ఎంపికైన అభ్యర్థులను సై...