Hyderabad, ఫిబ్రవరి 7 -- Ishika Taneja: మహా కుంభమేళాకు క్యూ కడుతున్న నటీమణులు.. గ్లామర్ ప్రపంచానికి గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక బాట పడుతున్నారు. ఈ మధ్యే మమతా కులకర్ణి కాషాయం కట్టగా.. తాజాగా మరో నటి, మాజీ మిస్ ఇండియా ఇషికా తనేజా కూడా అదే రూట్లో వెళ్లింది. మహా కుంభమేళాలో త్రివేణీ సంగమంలో మునిగిన ఆమె.. ఇక నటనకు గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక బాట పట్టనున్నట్లు చెప్పింది.

ఇషికా తనేజా మహా కుంభమేళాలో ఉన్న పలు ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఈ నటి ఇక గ్లామర్ ప్రపంచానికి దూరం కానుంది. ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ.. పొట్టి దుస్తుల్లో మహిళలు డ్యాన్స్ చేయకూడదని కూడా బోధిస్తోంది. 2017లో వచ్చిన ఇందు సర్కార్ మూవీలో నటించిన ఇషికా తీసుకున్న ఈ నిర్ణయం షాక్ కు గురి చేసింది.

ఆధ్యాత్మికత మార్గంలో వెళ్లినప్పుడే జీవితంలో నిజమైన మనశ...