భారతదేశం, మే 28 -- ఐపీఎల్​ 2025లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు సంచలనం సృష్టిస్తోంది! మంగళవారం ఎల్​ఎస్​జీతో జరిగిన మ్యాచ్​లో బ్యాటర్ల విధ్వంసంతో మరో 1.2 ఓవర్లు మిగిలుండగానే భారీ టార్గెట్​ (228)ని ఆర్సీబీ ఛేజ్​ చేసి పడేసింది. ఫలితంగా ఐపీఎల్​ 2025 లీగ్​ స్టేజ్​ని టాప్​-2తో ముగించింది. అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​లో విరాట్​ కోహ్లీ ఆర్సీబీ అత్యంత పటిష్ఠంగా ఉంది. ఈసారి కచ్చితంగా ఐపీఎల్​ ట్రోఫీ గెలుస్తుందని ఫ్యాన్స్​ చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఈ ఐపీఎల్​ 2025తో విరాట్​ కోహ్లీ, ఆర్సీబీ నిరీక్షణకు తెరపడుతుందా? ఈ విషయంపై చాట్​జీపీటీ, మెటా ఏఐ, గ్రాక్​ వంటి పవర్​ఫుల్​ చాట్​బాట్స్​ ఏం చెబుతున్నాయి? ఇక్కడ తెలుసుకోండి..

"విల్​ ఆర్సీబీ విన్​ ఐపీఎల్​ 2025?" అని మెటా ఏఐని అడిగినప్పుడు ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చింది. విరాట్​ కోహ్లీ టీమ్​ 9ఏళ్లల్లో తొలిసారి టె...