భారతదేశం, ఫిబ్రవరి 22 -- 'Circle to Search' feature: 2024లో ఆండ్రాయిడ్ యూజర్లలో విస్తృతంగా పాపులర్ అయిన గూగుల్ 'సర్కిల్ టు సెర్చ్' ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ కృత్రిమ మేధస్సు ఆధారిత టూల్ ఆండ్రాయిడ్ యూజర్లకు సులువుగా సెర్చ్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఇది ఐఫోన్లలో కూడా వస్తోంది. అయితే, ఐఫోన్ యూజర్లకు ఇది కొన్ని పరిమితులతో వస్తుంది.

మొదట్లో ఆండ్రాయిడ్ డివైజ్ లకు మాత్రమే ప్రత్యేకమైన ఈ 'సర్కిల్ టు సెర్చ్' ఫీచర్ ను ఐఫోన్ లకు "స్క్రీన్ సెర్చ్ విత్ గూగుల్ లెన్స్" గా రీబ్రాండ్ చేశారు. దీన్ని ఉపయోగించడానికి ఐఫోన్ యూజర్లు గూగుల్ లెన్స్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆండ్రాయిడ్ వెర్షన్ మాదిరిగా కాకుండా, ఇది ఐఫోన్లలో సిస్టమ్ వైడ్ గా పనిచేయదు. ఇది ప్రస్తుతం క్రోమ్, గూగుల్ యాప్స్ లో మాత్రమ...