భారతదేశం, అక్టోబర్ 5 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్ 17 సిరీస్​ని విడుదల చేసి కొన్ని వారాలు మాత్రమే అయింది. అప్పుడే తదుపరి సిరీస్ అయిన ఐఫోన్ 18 గురించి పుకార్లు, లీక్‌లు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లోకెల్లా అతిపెద్ద రూమర్​ ఏంటంటే.. యాపిల్ సంస్థ 2026లో అసలు ఐఫోన్ 18 బేస్ మోడల్‌ను విడుదల చేయకపోవచ్చు! దాన్ని 2027 ప్రథమార్థం తర్వాత లాంచ్​ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ రూమర్లు స్టాండర్డ్ ఐఫోన్ 18 గురించి మాత్రమే. ఐఫోన్ 18 సిరీస్​లోని ఇతర మోడల్స్ అయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్​, పుకార్లలో ఉన్న ఐఫోన్ 18 ఫోల్డ్ మాత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుత నివేదికల ప్రకారం.. రాబోయే ఐఫోన్ 18 లైనప్, ఐఫోన్ 17 సిరీస్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉండవచ్చు. ఎందుకంటే, తదుపర...