భారతదేశం, సెప్టెంబర్ 20 -- యాపిల్ లవర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ అధికారికంగా సెప్టెంబర్ 19న ఇండియాలో అమ్మకానికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లను కొనుగోలు చేయడానికి భారీ సంఖ్యలో కస్టమర్లు తరలివెళ్లారు. దిల్లీలోని సాకేత్ సిటీవాక్ మాల్, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లోని యాపిల్ స్టోర్ల ముందు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరిన దృశ్యాలు సోషల్​ మీడియలో వైరల్​ అయ్యాయి. చాలా మంది కస్టమర్లు కేవలం కొత్త ఐఫోన్ మోడళ్లను మాత్రమే కాకుండా, కొత్తగా విడుదలైన యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ కొనుగోలు చేయడానికి కూడా వెళ్లారు.

అయితే రద్దీని ఇష్టపడని వారి కోసం.. యాపిల్ తన తాజా డివైజ్‌లను క్విక్ కామర్స్ సర్వీసుల ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చింది. కొన్ని నగరాల్లో ఇవి దాదాపు ఇన్​స్టెంట్​ హోమ్ డెలివరీని అంద...