భారతదేశం, సెప్టెంబర్ 6 -- ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన 'ఆ డ్రాపింగ్' ఈవెంట్‌ను మంగళవారం (సెప్టెంబర్ 9న) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్​తో పాటు కొత్త యాపిల్ వాచ్, అప్‌డేట్ చేసిన ఎయిర్‌పాడ్స్, మరికొన్ని యాక్సెసరీలను ఈ వేడుకలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈసారి యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో నాలుగు వేరియంట్లను విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అవి.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్, బేసిక్ మోడల్ ఐఫోన్ 17.

గత నెలలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ ఈవెంట్ గురించి ఒక థర్మల్ కెమెరా ఇమేజ్ తరహాలో స్టైల్ చేసిన లోగోతో సంకేతం ఇచ్చారు. దీనితో, ఈ కొత్త ఫోన్‌లో థర్మల్ కెమెరా లేదా వేపర్-ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉండవచ్చని యాపిల్​ లవర్స్​ అంచనా వేస్తున్నారు. యాపిల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి ఎలాంటి ...