భారతదేశం, మార్చి 20 -- iPhone 15 price drop: ఆపిల్ ఐఫోన్ 15 ఇప్పుడు దిగ్గజ ఈ కామర్స్ సైట్ ఆమెజాన్ లో గణనీయమైన డిస్కౌంట్ లో లభిస్తుంది. రూ.59,900 ధరతో ఇటీవల లాంచ్ అయి, ఆపిల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ గా అందరి దృష్టిని ఆకర్షించిన ఐఫోన్ 16ఇ కన్నా కూడా ఇప్పుడు, ఐఫోన్ 15 తక్కువ ధరకు లభిస్తుంది. అందువల్ల ఐఫోన్ 16ఈ కన్నా ఐఫోన్ 15 స్మార్ట్ ఎంపిక అవుతుంది.

అమెజాన్ లో ఇప్పుడు ఐఫోన్ 15 ధర 23 శాతం తగ్గింది. ముఖ్యంగా 128 జీబీ బ్లూ వేరియంట్ ధరను రూ.61,900 కు తగ్గించింది. ఈ ధర తగ్గింపుతో, ఇతర ఆఫర్లను కలుపుకుంటే, ఐఫోన్ 16 ఇ కంటే తక్కువ ధరకే ఇది లభిస్తుంది. అయితే, ఇది కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉండే లిమిటెడ్ టైమ్ ఆఫర్ అని గుర్తుంచుకోవాలి.

ఎక్స్చేంజ్ ఆఫర్ ఈ డీల్ ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఇది మీ ప్రస్తుత స్మార్ట్ఫోన్ పరిస్థితిని బట్టి రూ. 43,10...