భారతదేశం, జూన్ 10 -- కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన యాపిల్​ వరల్డ్​వైడ్​ డెవలపర్స్​ కాన్ఫరెన్స్​లో భాగంగా టెక్​ దిగ్గజం పలు కీలక, ఆసక్తికర ప్రకటనలు చేసింది. కొత్త సాఫ్ట్​వేర్​ డిజైన్​ ఇంటర్​ఫేస్​ "లిక్విడ్​ గ్లాస్​", ఐఫోన్​ కోసం ఐఓఎస్​ 26 వంటి ప్రకటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్​ డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్​కి సంబంధించిన హైలైట్స్​ని ఇక్కడ చూసేయండి..

లిక్విడ్ గ్లాస్ అనేది యాపిల్ సంస్థ తమ సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లన్నిటికీ తీసుకొచ్చిన సరికొత్త డిజైన్ ఇంటర్‌ఫేస్. ఇది ఉపరితలంపై నిగనిగలాడే ట్రాన్స్​పరెంట్​ విజువల్స్​ని కలిగి ఉంటుందని తెలిపారు.

యాపిల్ హ్యూమన్​ ఇంటర్‌ఫేస్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ ఆలన్ డై ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. "ఈ రోజు మా డిజైన్‌కు ఒక ఉత్తేజకరమైన, అందమైన కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇది మా ఉత్పత్తుల తదుపరి శకానికి ర...