భారతదేశం, ఏప్రిల్ 2 -- iOS 18.4 update: ఐఫోన్ యూజర్ల కోసం ఆపిల్ కొత్త ఫీచర్లు, ఫిక్స్ చేస్తూ ఐఓఎస్ 18.4 అప్డేట్ ను అధికారికంగా విడుదల చేసింది. అదనంగా, భారతదేశంలోని ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కు యాక్సెస్ పొందారు. ఇది అధునాతన ఏఐ ఫీచర్లను తీసుకువచ్చింది. ఈ అప్ డేట్ తో కొన్ని అద్భుతమైన ఐఓఎస్ 18.4 ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త అప్ డేట్ లో విజువల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్,ప్రయారిటీ నోటిఫికేషన్, యాంబియంట్ మ్యూజిక్, మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

విజువల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ఐఓఎస్ 18.4 అప్ డేట్ కు ముందు, విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఐఫోన్ 16 సిరీస్ మోడల్ కు ప్రత్యేకంగా ఉండేది. అయితే, అప్డేట్ తర్వాత, ఆపిల్ ఈ ఏఐ ఆధారిత ఫీచర్ కోసం షార్ట్ కట్ ను కంట్రోల్ సెంటర్ కు తీసుకురావడం ద్వారా ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్...