భారతదేశం, జూన్ 10 -- అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన యాపిల్​ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025 ఈవెంట్​లో iOS 26 ఆపరేటింగ్​ సిస్టమ్​ని ఆవిష్కరించింది దిగ్గజ టెక్​ సంస్థ. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న iOS 18 తర్వాత iOS 19 రావాల్సి ఉంది. కానీ డైరక్ట్​గా iOS 26ని ప్రవేశపెట్టింది. దీనికి కారణాలేంటి? కొత్త ఆపరేటింగ్​ సిస్టమ్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దీని ప్రత్యేకతలేంటి? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

తమ నేమింగ్​ వ్యవస్థను మారుస్తున్నట్టు యాపిల్​ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025 ఈవెంట్​లో సంస్థ ప్రకటించింది. ప్రతి వెర్షన్ సీక్వెన్షియల్ నంబర్‌లకు బదులుగా ఇప్పుడు సంవత్సరం పేర్లను ఇవ్వడం జరుగుతుందని ప్రకటించింది.

అందుకే iOS 18 తర్వాత iOS 26 అందుబాటులోకి వచ్చింది. ఇది ఐఓఎస్​కి మాత్రమే కాదు.. మొత్తం యాపిల్​ ప్రాడక్ట్స్​కి ఒకే విధంగా ఉంటుంది. అంటే.....