భారతదేశం, ఏప్రిల్ 16 -- Indrakeeladri Theft: బెజవాడ ఇంద్రకీలాద్రిపై హైదరాబాద్‌కు చెందిన భక్తులు నిలువుదోపిడీకి గురయ్యారు. కారులో ఉంచిన 272 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఘాట్‌ రోడ్డు ఓంకారం టర్నింగ్ పాయింట్ వద్ద కారులో ఉంచిన 25 కాసుల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురంలో జరిగే పెళ్లికి వెళ్తూ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనం పూర్తి చేసుకుని వచ్చేసరికి నగలు మాయం అయ్యాయి.

దుర్గగుడిలో అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల నగలు చోరీకి గురైన ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఈ క్రమంలో కొండపై సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వెలుగు చూసింది.

కారులో ఉన్న లగేజీ ఎలా ఉన్నది అలాగే ఉండగా ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ మాత్రం మాయమైంది. మొత్త...