భారతదేశం, మార్చి 10 -- ట్రావెలింగ్​ చేయాలనుకుంటున్న వారికి బంపర్​ ఆఫర్​! దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో.. విమాన టికెట్లపై అతి భారీ సేల్​ని నిర్వహిస్తోంది. "హోలీ గెట్​అవే సేల్​"లో భాగంగా ఇప్పుడు ఇండిగోలో డొమెస్టిక్​ ఫ్లైట్​ రేట్లు రూ. 1199 నుంచే ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా ఈ సేల్​ వర్తిస్తుంది. రూ. 4,199 వద్ద ఇంటర్ననేషనల్​ ఫ్లైట్​ టికెట్​ రేట్లు ప్రారంభమవుతున్నాయి. అంతేకాదు, goindigo.in లో టికెట్​లు బుక్​ చేసుకుంటే, అదనంగా 5శాతం వరకు తగ్గింపు లభిస్తుండటం మరో విశేషం!

ఇండిగో తీసుకొచ్చిన ఈ గెట్​అవే హోలీ సేల్.. 2025​ మార్చ్​ 10, అంటే సోమవారం మొదలై- 2025 మార్చ్​ 12, బుధవారం వరకు కొనసాగుతుంది. ఈ తేదీల్లో విమాన టికెట్​లను బుక్​ చేసుకునే వారికే ఈ సేల్​ వర్తిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. 2025 మార్చ్​ 17 నుంచి 2025 సెప్టెంబర్​...