భారతదేశం, ఫిబ్రవరి 4 -- అక్రమ వలసదారుల వ్యవహారంలో అత్యంత కఠినంగా ఉంటున్న డొనాల్డ్​ ట్రంప్​ టీమ్​ నుంచి మరో వార్త బయటకు వచ్చింది. కొందరు భారతీయ వలసదారులను అమెరికా నుంచి వెనక్కి పంపించేస్తున్నారు. ఈ మేరకు ఒక సీ-17 మిలిటరీ విమానం ఇండియాకు బయలుదేరింది. వీరందరు అక్రమంగా అమెరికాలో నివాసముంటున్నారని, అందుకే డిపోర్ట్​ చేస్తున్నామని ట్రంప్​ యంత్రాంగం స్పష్టం చేసింది.

ట్రంప్​ తన ఇమ్మిగ్రేషన్​ అజెండా కోసం మిలిటరీ సాయం తీసుకుంటున్నారు. అమెరికా- మెక్సికో సరిహద్దులకు అదనపు బలగాలను పంపించారు. ఇమ్మిగ్రెంట్స్​ని డిపోర్ట్​ చేసేందుకు మిలిటరీ విమానాలను వాడుకుంటున్నారు లేదా వారికి ఆశ్రయం కల్పించేందుకు మిలిటరీ స్థావరాలను నిర్మిస్తున్నారు.

అక్రమ వలసదారులతో కూడిన కొన్ని విమానాలు ఇప్పటికే గ్వాటెమాలా, పెరూ, హోండురస్​కు చేరుకున్నాయి. ఇప్పుడు దూరంగా ఉన్న ఇండియాకు ...