భారతదేశం, ఏప్రిల్ 7 -- ప్రపంచ స్టాక్​ మార్కెట్​లను అనుసరిస్తూ దేశీయ సూచీలు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అతి భారీ నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 3,985​ పాయింట్లు (5.29శాతం) కోల్పోయి 71,380 వద్ద ఓపెన్​ అయ్యిది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 1,146 (5శాతం) పాయింట్లు పడి 21,758 వద్ద సెషన్​ని ప్రారంభించింది.

ప్రపంచ స్టాక్​ మార్కెట్​లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ 'టారీఫ్​' పిడుగు పడింది. ఆయన టారీఫ్​లకు ప్రతిచర్యగా చైనా కూడా అమెరికా మీద విపరీతమైన సుంకాలను విధించడంతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్​ సెంటిమెంట్​ దెబ్బతింది. ఫలితంగా గత గురువారం నుంచి ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు పడుతూనే ఉన్నాయి. 'బ్లాక్​ మండే' భయాల మధ్య ఆసియా సూచీలు అత్యంత భారీ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. జపాన్​ నిక్కీ తొలుత ఏకంగా 9శాతం పతనమైంది. ఈ పరిస్థితుల మధ్య దేశీయ సూచీలు కూ...