భారతదేశం, మార్చి 6 -- డిపార్ట్​మెంటల్ సెలక్షన్ ఫ్రేమ్​వర్క్​లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సదరు ఫ్రేమ్​వర్క్​ని పునఃసమీక్షించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 2025 మార్చ్​ 4 నాటికి ఆమోదం పొందని గ్రూప్ 'సీ' ఎల్​డీసీఈఎస్ / జీడీసీఈఎస్ పెండింగ్ సెలక్షన్లను రద్దు చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు కొత్త ఎంపికలను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రైల్వే బోర్డు బుధవారం అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లకు సర్క్యులర్ పంపింది.

డిపార్ట్​మెంటల్ పరీక్ష పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై ఉత్తర్​ప్రదేశ్​లోని మొఘల్ సరాయ్​లో ఈస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన 26 మంది రైల్వే అధికారులను సీబీఐ అరెస్టు చేసిన తరువాత మంత్రిత్వ శాఖ తాజా చర్యలు తీసుకుంది. విచారణలో భాగంగా రూ.1.17 కోట్ల నగదును స్వాధీనం చేసుక...