భారతదేశం, మార్చి 9 -- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నేడు చివరి రోజు!అర్హులైన అభ్యర్థులు iob.in ఐఓబీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 750 పోస్టులను భర్తీ చేయనున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. మార్చ్​ 9, ఆదివారంతో ముగుస్తుంది. ఆన్​లైన్ పరీక్ష తేదీ మార్చ్​ 16, 2025గా నిర్ణయించారు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద తెలుసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.

2. వయస్సు

అప్లై చేస్తున్న సదరు అభ్యర్థి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్​ కేటగిరీ ...