భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఊహాగానాలను నిజం చేస్తూ పాకిస్థాన్​ యూ-టర్న్​ కొట్టింది! టీ20 ప్రపంచకప్​లో భారత్​తో ఆడమంటూ ఇంతకాలం చూపించిన మొండి వైఖరిని వీడింది. ఫలితంగా ఈ ఆదివారం, ఫిబ్రవరి 15 2026న ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​ మహా సమరం యథాతథంగా కొనసాగనుంది.

సుమారు రూ. 4,000 కోట్ల విలువైన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ మ్యాచ్‌పై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ముగింపు లభించింది. ఈ మేరకు సోమవారం అర్థరాత్రి పాక్​ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

పాకిస్థాన్ ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో ఇలా పేర్కొంది:

"బహుపాక్షిక చర్చల్లో సాధించిన ఫలితాలు, మిత్రదేశాల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని.. ఫిబ్రవరి 15, 2026న జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టును ప్రభుత్వం ఆదేశిస్తోంది. క్రికెట్ స్ఫూర్తిని కా...