భారతదేశం, సెప్టెంబర్ 29 -- ఆదివారం జరిగిన ఆసియా కప్​ ఫైనల్​లో పాకిస్థాన్​పై గెలిచిన టీమిండియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్​ సిందూర్​ని గుర్తు చేస్తూ ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

"క్రీడా మైదానంలో ఆపరేషన్​ సిందూర్​. ఫలితం మాత్రం ఒక్కటే- భారత్​ గెలుపు," అని మోదీ ట్వీట్​ చేశారు.

పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్​లోని ఉగ్ర స్థావరాలపై భారత ప్రభుత్వం మే నెలలో ఆపరేషన్​ సిందూర్​ని చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్​ సహా పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్​ దాడి చేసి, వాటిని ధ్వంసం చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఈ తరుణంలో జరుగుతున్న ఆసియా కప్​లో భారత్​-పాక్​ మ్యాచ్​లను బహిష్కరించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ మ్యాచ్​లు యథాతథంగా కొనసాగాయి. టోర్నీలో పాకిస్థాన్​తో భారత్​ మూడ...