భారతదేశం, ఫిబ్రవరి 2 -- కొన్నిసార్లు సెర్చ్​ హిస్టరీ సేవ్​ అవ్వకుండా ఉండేందుకు ఇన్​కాగ్నిటో మోడ్​ వాడుతుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే.. కొన్నికొన్నిసార్లు ఇన్​కాగ్నిటో మోడ్​లో సెర్చ్​ చేసినా, ఆ డేటా సిస్టెమ్​లోని ఇతర చోట్ల సేవ్​ అవుతూ ఉంటుంది. మీ ప్రైవసీ కోసం వాటిని డిలీట్​ చేస్తే బెటర్​. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​, విండోస్​, మ్యాక్​ డివైజ్​లలో ఇన్​కాగ్నిటో హిస్టరీని ఎలా డిలీట్​ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..

వెబ్ బ్రౌజర్లలో ఇన్​కాగ్నిటో మోడ్.. బ్రౌజింగ్ హిస్టరీ, కుకీలు, ఇతర సైట్ డేటాను సేవ్ చేయడాన్ని నిరోధిస్తుంది. మీరు ఈ మోడ్ ఉపయోగించినప్పుడు, మీ బ్రౌజింగ్ యాక్టివిటీ బ్రౌజర్ హిస్టరీలో లాగిన్ అవ్వదు. ఫామ్​ ఇన్​పుట్​లు లేదా సెర్చ్​ ప్రశ్నలు వంటి డేటా సేవ్ అవ్వదు. అయితే, ఇది మీ ఆన్​లైన్ యాక్టివిటీని వెబ్​సైట్​లు, మీ ISP లేదా నెట్​వర్క్ న...