భారతదేశం, మార్చి 21 -- మార్చ్​ నెలలో ఓవైపు ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుంటే, మరోవైపు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మాత్రం అనేక రాష్ట్రాలకు చల్లటి వార్తను అందించింది. వచ్చే వారం వరకు అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇందుకు ఒక కారణం అని పేర్కొంది.

పశ్చిమ్​ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ నెల 20న మొదలైన వర్షాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

మార్చ్​ 21న పశ్చిమ మధ్యప్రదేశ్​లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, 22 వరకు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్​గఢ్​లో వర్షాలు కురుస...