భారతదేశం, ఏప్రిల్ 14 -- దేశంలో రానున్న రోజుల్లో కనిపించే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక అప్డేట్​ ఇచ్చింది. ఏప్రిల్​ 15 నుంచి గుజరాత్​తో పాటు వాయువ్య భారతంలో హీట్​వేవ్​ పరిస్థితులు కనిపిస్తాయని వెల్లడించింది. మరోవైపు, తూర్పు భారతంతో పాటు తూర్పు మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో 4,5 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.

దిల్లీ-ఎన్​సీఆర్​ సహా వాయువ్య భారతదేశంలో ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 18 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఏప్రిల్ 14న దిల్లీలో ప్రధానంగా రోజంతా స్పష్టమైన ఆకాశం కనిపిస్తుందని, గరిష్ట ఉష్ణోగ్రత 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరపడే ...