భారతదేశం, సెప్టెంబర్ 19 -- బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఇన్​స్టిట్యూట్ (ఐబీపీఎస్​) నుంచి ఐబీపీఎస్​ ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఈ సెప్టెంబర్ నెలలోనే, ఎప్పుడైనా విడుదల కావచ్చు. ఐబీపీఎస్​ పీఓ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు, ఆ తర్వాత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ రెండు దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఐబీపీఎస్​ పీఓ పరిలిమ్స్​ పరీక్షలు 2025 ఆగస్టు నెలలో జరిగాయి.

పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ ibps.in లో చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఎలాంటి హార్డ్ కాపీ (అంటే పోస్టులో పంపే కాగితపు కాపీ) పంపరు. అందుకే, ఆన్‌లైన్‌లో మాత్రమే మీ స్కోర్ చూసుకోవడం సాధ్యమవుతుంది.

ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ ...