భారతదేశం, ఫిబ్రవరి 10 -- హ్యుందాయ్ భారతదేశంలో కొత్త తరం వెన్యూను పరీక్షించడం ప్రారంభించింది. న్యూ జనరేషన్​ హ్యుందాయ్ వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ ఈ ఏడాది చివరిలో లాంచ్ కానుంది! అంతకు ముందు రోడ్డుపై కనిపించిన టెస్ట్ మ్యూల్ కొన్ని వివరాలను వెల్లడించింది. న్యూ జెన్​ హ్యుందాయ్ వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ కొన్ని మార్పులతో రానుంది. ఈ అప్​డేటెడ్ ఎస్​యూవీ ఎక్స్​టీరియర్​తో పాటు క్యాబిన్ లోపల డిజైన్ మార్పులతో వస్తుంది.

సబ్-కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్.. భారత ప్యాసింజర్ వాహన మార్కెట్​లో అత్యంత పోటీ, అధిక-డిమాండ్ ఉన్న సెగ్మెంట్​. టాటా మోటార్స్, హ్యుందాయ్, రెనాల్ట్, నిస్సాన్, మహీంద్రా, మారుతీ సుజుకీ, స్కోడా వంటి ఆటోమొబైల్ కంపెనీలు ఈ రంగంలో ప్రాడక్ట్స్​ని కలిగి ఉన్నాయి. టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజ్జా, స్కోడా కైలాక్, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స...