భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల సీజ్ చేసే కార్యక్రమానికి నెల రోజులు హైడ్రా విరామం ఇచ్చింది. ఈ నెల రోజుల గడువులో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా షాపులు, వ్యాపార సముదాయాల వారు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. నెల తర్వాత తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.

ఈ మేరకు షాపుల యజమానులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో పాటు హైడ్రా, జీహెచ్ ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను వివరించారు. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో జీహెచ్ ఎంసీ, ఫైర్, పోలీసు విభాగాలతో హైడ్రా తనిఖీలు చేసి 9 షాపుల వరకూ సీజ్చేసిన విషయం విధితమే. నెల రోజులు గడువు కావాలని పలు వ్యాపార సంఘాలు, దుకాణదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని సమావేశం పరి...