భారతదేశం, అక్టోబర్ 4 -- పండుగ సీజన్​లో ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే, అనుకున్నది జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. మరి మీరు కూడా ఈ పండుగ సీజన్​లో మీ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! కోటి సంపద వెనకేసుకునేందుకు, ఈ 2025లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

మ్యూచువల్​ ఫండ్స్​- డైరక్ట్​ స్టాక్స్​లో ఇన్వెస్ట్​ చేసి కోట్లల్లో సంపదను సృష్టించుకున్న వారిని చూసే ఉంటారు. అది వినడానికి చాలా బాగున్నప్పటికీ, అంతే రిస్కీ కూడా! అందుకే, తక్కువ రిస్క్ కోరుకునే వారికి మ్యూచువల్​ ఫండ్స్​ సరైన ఆప్షన్​ అని నిపుణులు చెబుతుంటారు. రూ.500 సిప్​ (సిస్టమాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​)తోనే మీరు మీ మ్యూచువల్​ ఫండ్​ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించవచ్చు! దీర్ఘకాలంలో అ...