భారతదేశం, మార్చి 23 -- హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ ని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. కంపెనీ లేటెస్ట్​ ట్యాబ్లెట్​లో 11.5 ఇంచ్​ ఎల్​సీడీ స్క్రీన్​ ఉంది. ఈ గ్యాడ్జెట్​ స్నాప్​డ్రాగన్​ 685 చిప్​తో పనిచేస్తుంది. అంతేకాదు ఇది 8,300 ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తోంది. ఈ నేపథ్యంలో హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సరికొత్త హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏలో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 11.5 ఇంచ్​ 2.5కే రిజొల్యూషన్​ ఎల్​సీడీ స్క్రీన్​ ఉంటుంది.

ఫొటొగ్రఫీ కోసం హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ ట్యాబ్​లో ఆటో ఫోకస్​తో కూడిన 8 ఎంజీ రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంది.

హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏలో 8జీబీ ర్యామ్​ ఉంది. 128జీబీ వరకు స్టోరేజ్​ ఆప్షన్​ వస్తోంది. వైఫై, బ్లూటూత్​ 5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్...