భారతదేశం, మార్చి 6 -- ఫిబ్రవరిలో ఆర్​బీఐ రేట్​ కట్స్​ మొదలయ్యాయి. రానున్న కాలంలో వడ్డీ రేట్లు మరింత దిగొస్తాయని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోమ్​ లోన్​ తీసుకుని సొంత ఇంటి కలలను నెరవేర్చుకునేందుకు చాలా మంది సిద్ధపడుతున్నారు. అయితే మనకి తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగా హోమ్​ లోన్​ రిజెక్ట్​ అయ్యే ప్రమాదం ఉంటుంది. ​మళ్లీ పేపర్​ వర్క్​ అంటే కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు హోమ్​ లోన్​ అనేది ఎందుకు రిజెక్ట్​ అవుతుంది? రిజెక్ట్​ అయితే ఏం చేయాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

తక్కువ క్రెడిట్ రేటింగ్: తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉంటే మీకు అప్పు ఇచ్చే వారికి రిస్క్​ పెరుగుతున్నట్టు! ఇది బ్యాంక్​లకు ఇతర సంస్థలకు నచ్చదు. ఇలాంటి పరిస్థితుల్లో హోమ్​ లోన్​ పొందడం దాదాపు అసాధ్యం. ఆ తర్వాత మీ క్రెడిట్ రిపోర్ట్, క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుని తప్పులు ఏవైన...