భారతదేశం, ఏప్రిల్ 14 -- హిట్ 3 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నేచురల్ నాని హీరోగా నటించిన ఈ చిత్రం వైలెంట్ యాక్షన్‍తో ఉండనుందనే హైప్ ముందు నుంచి ఉంది. టీజర్ తర్వాత మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ తరుణంలో ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అనే నిరీక్షణ సాగింది. ఈ క్రమంలో నేడు (ఏప్రిల్ 14) హిట్ 3 ట్రైలర్ వచ్చేసింది. ఎలా ఉందంటే..

హిట్ 3 మూవీలో పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రను నాని చేశారు. "సర్.. క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్స్ సెల్‍లో ఉండాలి.. లేకపోతే సిక్స్ ఫీట్ హోల్‍లో ఉండాలి" అని పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ (నాని) చెప్పే ఇంటెన్స్ డైలాగ్‍తో హిట్ 3 ట్రైలర్ మొదలైంది. నేరస్థులు బయట ఫ్రీగా తిరగకూడదని అంటాడు. ఇంతలో ఓ చిన్నపాప కిడ్నాప్ కేసు అర్జున్ వద్దకు వస్తుంది. దాన్ని పర్సనల్‍గా తీసుకుంటాడు.

"ఆపదలో ఉన్న వాళ్లను రక్షించడానికి యోధుడు రంగం...