భారతదేశం, ఫిబ్రవరి 24 -- Hit 3 Teaser నాని హీరోగా న‌టించిన హిట్ 3 మూవీ టీజ‌ర్ వ‌చ్చేసింది. నాని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం ఈ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. యాక్ష‌న్‌, ర‌క్త‌పాతంతో ఈ టీజ‌ర్ సాగింది. ఇందులో వ‌యెలెంట్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నాని క్యారెక్ట‌రైజేష‌న్ డిఫ‌రెంట్‌గా సాగింది.

యాక్ష‌న్ అంశాల‌తోనే టీజ‌ర్ ప్రారంభ‌మైంది. మీకు ప్రాబ్లెమ్ లేదంటే ఓ పేరు చెబుతా...అర్జున్ స‌ర్కార్ అనే వాయిస్ ఓవ‌ర్ వినిపించింది. ఈ కేసును ఆడికి ఇవ్వ‌డంలో ప్రాబ్లెమ్ ఏం లేదు కానీ...వీడి లాఠీకి దొరికినోడి ప‌రిస్థితి ఆలోచిస్తేనే భ‌యం వేస్తుంది అని రావుర‌మేష్ చెప్ప‌గానే గుర్రంపై లాఠీ ప‌ట్టుకొని స్టైలిష్‌గా నాని టీజ‌ర్ ఎంట్రీ ఇచ్చాడు. లాఠీతో క్రిమిన‌ల్స్‌ను తుక్కురేగ్గొడుతూ నాని క‌నిపించాడు.

ఫ‌స్ట్ డే నిన్ను చూసిన‌ప్పుడే డౌట్ వ‌చ్చింది...ఒక పోలీస్ ఆఫీస‌ర్‌వేనా న...