Hyderabad, ఫిబ్రవరి 25 -- Highest Grossing Re Release Movie: రీరిలీజ్ సినిమాల హవా నడుస్తున్న కాలం ఇది. ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాలు కూడా రీరిలీజ్ లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అలా తాజాగా హిందీలో రీరిలీజై ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రీరిలీజ్ మూవీగా నిలిచింది సనమ్ తేరీ కసమ్.

సనమ్ తేరీ కసమ్ మూవీ మొదట ఫిబ్రవరి 5, 2016లో రిలీజైంది. సుమారు రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.16 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అదే సినిమాను 9 ఏళ్ల తర్వాత అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 7న రీరిలీజ్ చేశారు.

కానీ అనూహ్యంగా రీరిలీజ్ లో మాత్రం ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. వాలెంటైన్స్ వీక్ లో రిలీజ్ కావడంతో ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడీ మూవీ ఏకం...