భారతదేశం, జనవరి 27 -- ఇటీవలే జరిగిన భారత్​ మొబిలిటీ గ్లోబల్​ ఎక్స్​పో 2025లో చాలా ప్రాడక్ట్స్​ లాంచ్​ అయ్యాయి. వాటిల్లో ఒకటి హీరో ఎక్స్​పల్స్​ 210. ఈ అడ్వెంచర్​ బైక్ సూపర్​​ స్టైల్​, డిజైన్​ కారణంగా ఆటోమొబైల్​ ప్రియులను ఆకర్షించింది. ఈ బైక్​ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బైక్​ వేరియంట్లు, వాటి ఫీచర్లు- ధరలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హీరో ఎక్స్​పల్స్ 210 టాప్ ట్రిమ్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్​గా వస్తుంది. ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​లో 4.2 ఇంచ్​ టీఎఫ్​టీ డిస్​ప్లేను అందించారు. ఈ డిస్​ప్లే టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ సహా మరెన్నో ఫీచర్స్​ని కలిగి ఉంది. అలాగే, ఈ వేరియంట్ ట్రాన్స్​పరెంట్​ విండ్​స్క్రీన్​, నకిల్ గార్డులు, లగేజీ ర్యాక్​తో వస్తుంది. 170 కిలోల బరువున్న ఈ అడ్వె...