భారతదేశం, ఏప్రిల్ 7 -- ఉత్తర భారతంపై భానుడు విరుచుకుపడుతున్నాడు! మరీ ముఖ్యంగా దిల్లీలో ఏప్రిల్​ మొదటి వారం నుంచే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ వాసులకు మరింత ఆందోళనకర వార్తను ఇచ్చింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). సోమవారం నుంచి 3 రోజుల పాటు దిల్లీలో హీట్​వేవ్​ పరిస్థితులు ఉంటాయని చెబుతూ, ఈ మేరకు యెల్లో అలర్ట్​ని జారీ చేసింది.

ఏప్రిల్ 7 నుంచి 9 వరకు దిల్లీలో హీట్​వేవ్​ పరిస్థితులు ఉంటాయి. ఏప్రిల్ 7, 8 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్​కు, ఆ తర్వాత 41 డిగ్రీల సెల్సియస్​కు చేరుకుంటాయని ఐఎండీ ఆదివారం వెల్లడించింది.

"దిల్లీలో ప్రస్తుతం 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది సాధారణం కంటే 3 డిగ్రీలు అధికం! ఏప్రిల్ 7 నాటికి వడగాల్పులు వీచే అవకాశం ఉంది. కాగా ఏప్రిల్ 8 నుంచి 10 వరకు వెస్టర్న్​...