భారతదేశం, ఏప్రిల్ 12 -- భారీ ఉష్ణోగ్రతల అనంతరం కురిసిన వర్షాలతో దేశ రాజధాని దిల్లీలోని ప్రజలు శుక్రవారం కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని దిల్లీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 12న ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కానీ రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని స్పష్టం చేసింది. ఏప్రిల్ 16 నుంచి దిల్లీలో హీట్​వేవ్​ పరిస్థితి కనిపిస్తుందని, వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

శుక్రవారం సాయంత్రం దేశ రాజధానిని భారీ దుమ్ము తుపాను, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలకరించాయి. ఈ తాకిడికి పలు చెట్లు నేలకూలాయి. దీనికి తోడు ఈదురుగాలుల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్​కు తీవ్ర అంత...