భారతదేశం, నవంబర్ 29 -- Health Benefits of Olives : గుండె పనితీరు నుంచి ఎముకల ఆరోగ్యం వరకు.. పోషకాలతో నిండిన ఆలివ్​లు ఎంతో ప్రభావం చూపిస్తాయి అంటున్నారు నిపుణులు. ఇవి రుచికరమైనవి. అంతేకాకుండా వివిధ పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి నలుపు, ఆకుపచ్చని రంగులలో లభ్యమవుతాయి. అయితే ఆలివ్​, ఆలివ్ నూనెను డైట్​లో చేర్చుకోవడం వల్ల వివిధ బెనిఫిట్లను పొందవచ్చు అంటున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏమిటో.. ఎందుకు వీటిని డైట్​లో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒలేయిక్ యాసిడ్ అనే లాభదాయకమైన మోనో-అసంతృప్త రకాల కొవ్వుతో ఆలివ్‌లు పుష్కలంగా నిండి ఉంటాయి. ఈ సమ్మేళనం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంతో పాటు.. రక్తపోటును సాధారణ స్థాయికి తీసుకువస్తాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

అంతేకాకుండా అనేక అధ్యయనాలు.. ఆలివ్...