భారతదేశం, సెప్టెంబర్ 20 -- విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్​1బీ వీసా విషయంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీసుకున్న తాజా నిర్ణయంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. హెచ్​1బీ వీసా వార్షిక ఫీజును 1లక్ష డాలర్లు చేస్తున్నట్టు ట్రంప్​ చేసిన ప్రకటనతో వీసా ప్రోగ్రామ్​కు ముగింపు పడబోతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్ తీసుకున్న ఈ కఠినమైన వలసల నియంత్రణ నిర్ణయం ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది భారతీయ టెక్ ఉద్యోగులపై భారీ ప్రభావం చూపుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసేవారు, హెచ్1బీ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటారు.

"ఇది చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. కానీ కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వారికి ఉ...