భారతదేశం, మార్చి 26 -- మీనాకు చీర గిఫ్ట్‌గా తీసుకొస్తాడు బాలు. ఆ చీర చూసి మీనా సంబ‌ర‌ప‌డుతుంది. పైకి మాత్రం ఇప్పుడు అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చులు ఎందుకు అని భ‌ర్త‌తో అంటుంది. ఊళ్లో అంద‌రి ముందు నా పెళ్లాం త‌క్కువ కాకూడ‌దు క‌దా బాలు స‌మాధాన‌మిస్తాడు.

చీర కొన‌డానికే డ‌బ్బులు అడిగారా అని బాలుతో అంటుంది మీనా. తాగి తంద‌నాలు ఆడి, రాత్రి ఇంటికొచ్చి గొడ‌వ‌లు చేస్తాన‌ని అనుకున్నావా? కొన్ని మంచి ప‌నులు కూడా మొగుళ్లు చేస్తార‌ని అనుకోవ‌చ్చుగా బాలు స‌మాధాన‌మిస్తాడు. అయినా మీ పెళ్లాలు అలా ఎప్ప‌టికీ అనుకోర‌ని బాలు కోప్ప‌డుతాడు.

నువ్వు అలాగే అనుకున్నావ‌ని అలుగుతాడు. భ‌ర్త‌కు సారీ చెబుతుంది మీనా. అత‌డి కోపం పోగొట్ట‌డానికి అత‌డికి ఐ ల‌వ్ యూ చెబుతుంది. అయినా బాలు కోపం త‌గ్గ‌క‌పోవ‌డంతో అత‌డికి ముద్దు పెడుతుంది. మీనా ముద్దుతో బాలు కోపం ఎగిరిపోతుంది.

రాజ‌మౌళి సినిమా...