భారతదేశం, మార్చి 1 -- Gunde Ninda Gudi Gantalu: రోహిణి ఇంట్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌నోజ్ కంగారు ప‌డ‌తాడు. ఆమె స్నేహితురాలు విద్య‌కు ఫోన్ చేస్తాడు. రోహిణి త‌న‌ను క‌లిసిన మాట నిజ‌మేన‌ని, కానీ మా ఇంట్లో నుంచి ఎక్క‌డికో వెళ్లిపోయింద‌ని విద్య స‌మాధానం చెబుతుంది. రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి నువ్వే కార‌ణ‌మంటూ బాలును నిందిస్తుంది ప్ర‌భావ‌తి.

నా భార్య‌ను అన‌డానికి నువ్వెవ‌డు అంటూ బాలు కాల‌ర్ ప‌ట్టుకుంటాడు మ‌నోజ్‌.కాల‌ర్ వ‌ద‌ల‌మ‌ని మ‌నోజ్‌కు వార్నింగ్ బాలు. అయినా మ‌నోజ్ విన‌క‌పోవ‌డంతో చెంప‌పై గ‌ట్టిగా ఒక్క‌టి కొడ‌తాడు. అయినా విన‌కుండా బాలును కొట్ట‌డానికి మ‌నోజ్ వ‌స్తాడు. దాంతో చేయి వెన‌క్కి విరిచి మ‌నోజ్‌ను చిత‌క్కొడ‌తాడు బాలు. దెబ్బ‌ల‌కు తాళ‌లేక మ‌నోజ్ ల‌బోదిబోమంటాడు.

అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన స‌త్యం...కొడుకులు కొట్టుకోవ‌డం చూసి త‌ట్టుక...