భారతదేశం, సెప్టెంబర్ 21 -- కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు రేపు, అంటే సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబ్‌లు (5%, 12%, 18%, 28%) ఇకపై రెండు శ్లాబ్‌లుగా (5%, 18%) మారనున్నాయి. కొన్ని ప్రత్యేక వస్తువులు, లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధించనున్నారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గే వస్తువులు, ధరలు పెరిగే వస్తువుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, కిచెన్ వస్తువులు, మందులు సహా దాదాపు 375 వస్తువుల ధరలు రేపటి నుంచి తగ్గనున్నాయి.

ఆహార పదార్థాలు: పాలు కలిపిన పానీయాలు, కాఫీ, కండెన్స్‌డ్ మిల్క్, బిస్కట్లు, వెన్న, తృణధాన్యాలు, కార్న్‌ఫ్లేక్స్, 20-లీటర్ ప్యాకేజ్డ్ తాగునీరు, డ్రైఫ్రూట్స్, పండ్ల గుజ్జు, నెయ్యి, ఐస్‌క్రీమ్, జామ్, కెచప్, నమ్‌కీన్, పనీర్, స్నాక్స్, సాసే...