భారతదేశం, ఫిబ్రవరి 4 -- Google search crimes: ఇంటర్నెట్ మనం సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని సెర్చ్ లు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారి తీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు వ్యక్తుల ఆన్లైన్ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తుంటాయి. వ్యక్తులు ప్రజా భద్రత, జాతీయ భద్రతను రక్షించే చట్టాలకు కట్టుబడి ఉండాలి. అనుకోకుండా లేదా ఉత్సుకతతో చేసినప్పటికీ, గూగుల్ లో కొన్ని సెర్చ్ లు పోలీస్ దర్యాప్తునకు, లేదా జరిమానాలకు లేదా జైలు శిక్షకు కూడా దారితీయవచ్చు. అందువల్ల బీ కేర్ ఫుల్.

చాలా దేశాల్లో బాంబు తయారీ సూచనల కోసం ఆన్ లైన్ లో వెతకడం తీవ్రమైన నేరం. ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆన్లైన్ కార్యకలాపాలను జాతీయ భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి. ఈ తరహా సెర్చ్ లపై వెంటనే స్పంద...